![]() |
![]() |

బుల్లితెరపై సుమ అంటే ఓ బ్రాండ్. ఆమె భర్త రాజీవ్ కనకాలకు సినిమాల్లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు పడుతున్నాయి. కానీ, టీవీలో అంత పేరు లేదు. అయినా ఆయన్ను తీసుకొచ్చి ‘రెచ్చిపోదాం బ్రదర్’లో కూర్చోబెట్టింది మల్లెమాల సంస్థ. ఆ కామెడీ షోలో ఆయన కూడా పెద్ద తరహాలో, అప్పుడుప్పుడూ తన పరిధి మీరకుండా పంచ్‌లు వేశారు. ఇప్పుడు చూస్తేంటే... షోలో రాజీవ్ కనకాల ప్లేస్‌ను డాన్స్ మాస్టర్ బాబాతో రీప్లేస్ చేసినట్టు ఉన్నారు.
బాబా మాస్టర్ డ్యాన్సే కాదు, మాస్ కామెడీ చెయ్యడంలో మంచి ఘనుడు. ‘ఢీ’లో సుధీర్, ఆదితో కొన్ని ఎపిసోడ్స్‌లో ఫుల్ కామెడీ చేశాడు. తమిళ యాసతో కూడిన తెలుగుతో నవ్విస్తుంటారు. ఇప్పుడు ఆయన్ను తీసుకొచ్చారు. బహుశా... సినిమా షూటింగ్స్‌తో ‘రెచ్చిపోదాం బ్రదర్’కు రాజీవ్ డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోవడం అయినా అయ్యుండాలి. లేదంటే షోకు కొత్త కలర్ తీసుకురావడానికి బాబాను తీసుకొచ్చి అయినా ఉండాలి. ఆల్రెడీ బాబా మాస్టర్‌తో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ‘రెచ్చిపోదాం బ్రదర్. ఇక నుంచి వెరే లెవల్’ అని అందులో చెప్పారు.
బాబా మాస్టర్ ప్రోమో కింద ‘రాజీవ్‌ని తీసేసి మంచిపని చేశారు’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘రాజీవ్ పోయి బాబా వచ్చే డాండాం’ అని ఇంకొకరు. రాజీవ్ వెళ్లిపోవడం, బాబా మాస్టర్ రావడం డిస్కషన్ పాయింట్ అవుతోంది.
![]() |
![]() |